MLA జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-02T19:28:12+05:30 IST

రోడ్డు నెంబర్ 12లోని ఎమ్మెల్యే (MLA) జీవన్ రెడ్డి ఇంటికి బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు.

MLA జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు

హైదరాబాద్ (Hyderabad): రోడ్డు నెంబర్ 12లోని ఎమ్మెల్యే (MLA) జీవన్ రెడ్డి (Jeevan reddy) ఇంటికి బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. ఎమ్మెల్యేపై హత్యకు కుట్రపై విచారణ చేస్తున్నారు. జీవన్ రెడ్డి నుంచి మరి కొంత సమాచారాన్ని తీసుకోవడానికే పోలీసులు వచ్చారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రసాద్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన  టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. విచారణ కొనసాగుతోంది.


ఆర్నూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) ఇంటి వద్ద అనుమాన స్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-08-02T19:28:12+05:30 IST