Kodali nani: దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని
ABN , First Publish Date - 2022-10-04T17:19:37+05:30 IST
ఇంద్రకీలాద్రి దసరా మమోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
విజయవాడ: ఇంద్రకీలాద్రి దసరా మమోత్సవాలు (Dussera celebrations) వైభవంగా జరుగుతున్నాయి. మహిషాసుర మర్ధిని దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మను ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali nani) దర్శించుకున్నారు. ఎమ్మెల్యే (YCP MLA)కు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ... అన్ని శాఖలు సమన్వయంతో దసరా ఏర్పాట్లు అద్భుతంగా చేశారన్నారు. దుర్గమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. సీఎం అన్ని మతాలవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వీవీఐపీలు, వీఐపీలు అమ్మవారి దర్శనంలో ఆలస్యం అవుతుందని అనుకొకూడదని ఎమ్మెల్యే కొడాలి నాని (MLA) పేర్కొన్నారు.