
హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్‌పై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను గజం స్థలం కబ్జా చేసినట్లు రుజువు చేస్తే పఠాన్‌చెరు పీఎస్ ఎదుట విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తన హయాంలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై నందీశ్వర్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. తనపై ఆరోపణలను ఆధారాలతో రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి