Advertisement

అదనపు పడకలు ఏర్పాటుచేయాలి

Apr 21 2021 @ 23:37PM
జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముస్తఫా

ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు, ఏప్రిల్‌ 21: కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే అదనపు పడకలతో వైద్యసేవలను పెంపొందించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతిని కోరారు. జీజీహెచ్‌ ను సందర్శించిన ఎమ్మెల్యే ఆస్పత్రిలో వైద్యసేవలపై సూపరింటెండెంట్‌తో చర్చించారు. వైద్య సేవలు, సౌకర్యాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వైద్య సేవలందించి రోగుల్లో మనోధైర్యం కల్పించాలన్నారు. సూపరింటెండెంట్‌ స్పందిస్తూ అదనపు పడకలను ఏర్పాటుచేస్తున్నామని, ఈ వారంలో అదనపు సిబ్బందికోసం భర్తీ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైన సౌకర్యాల కోసం తనకు ప్రతిపాదనలు అందజేయాలని  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.