దళితులకు సీఎం కేసీఆర్‌ అండ

ABN , First Publish Date - 2022-06-24T05:48:07+05:30 IST

దళితులకు సీఎం కేసీఆర్‌ అండ

దళితులకు సీఎం కేసీఆర్‌ అండ
లబ్ధిదారుడికి డోజర్‌ వాహనాన్ని అందజేస్తున్న ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే నరేందర్‌

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ 

ఓసిటీలో ‘దళితబంధు’ లబ్ధిదారులకు వాహనాల పంపిణీ 


రంగల్‌టౌన్‌,  జూన్‌ 23: దళితుల అభివృద్ధికి  సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తూ వారి పాలిట దేవుడిగా నిలిచారని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. వరంగల్‌ 19వ డివిజన్‌ ఓసిటీలో గురువారం వరంగల్‌ తూర్పు నియోజవర్గ పరిధిలోని లబ్ధిదారులకు దళితబంధు పథకం కింద 100 యూనిట్లను పంపిణీ చేశారు. ఎంపీ పసునూటి దయాకర్‌తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌.. లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిన ఘనత  సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  రూ.10లక్షల సాయంతో పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకుని దళితులు అభివృద్ధి చెందేలా ప్రొత్సహిస్తున్నారని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా చేయలేని పనులను చేస్తూ దేశ్‌కీ నేతగా కేసీఆర్‌ గుర్తింపు పొందుతుంటే బీజేపీ నాయకులకు మింగుడుపడడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానన్నారు. నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది వేలాది మందికి ఉపాది లభించేలా కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయని ఆరోపించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌ మసూద్‌, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 


నిరుద్యోగులకు అండగా నర్సింహమూర్తి ట్రస్ట్‌ సేవలు

మట్టెవాడ: వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని పేదలకు సేవలందించేందుకే నన్నపునేని నర్సింహమూర్తి ట్రస్ట్‌ను స్థాపించినట్లు వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. వరంగల్‌ స్టేషన్‌రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌, గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నరేందర్‌, సతీమణి వాణి, కుమారుడు లోకేశ్‌పటేల్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన తండ్రి జన్మనిస్తే.. సీఎం కేసీఆర్‌ తనకు రాజకీయ పునర్జన్మనిచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్థేశంలోనే ట్రస్ట్‌ ద్వారా సేవలందిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉచిత భోజనంతో పాటు స్టడీ మెటీరియల్‌ అందిస్తామని తెలిపారు. జూన్‌ 30వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, జూన్‌ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభవమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సైకాలజిస్టు బరుపాటి గోపి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌మసూద్‌, కార్పొరేటర్లు గందె కల్పన నవీన్‌, దిడ్డి కుమారస్వామి, మారుపల్లి రవి, వస్కుల బాబు,టీఆర్‌ఎస్‌ నాయకులు గందె నవీన్‌, ఆకుతోట శిరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-06-24T05:48:07+05:30 IST