అధికారులతో తీరుపై పప్పు సెనగ రైతులకు తీవ్ర నష్టం: పయ్యావుల

Nov 27 2021 @ 13:49PM

అనంతపురం: అధికారుల తీరు వల్ల పప్పు సెనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికారులు ఈ క్రాపింగ్ చేయలేదని మండిపడ్డారు. మంత్రికి కూడా తప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. ఈ క్రాప్ చేయకపోతే పప్పు శనగ రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో ఈ క్రాప్ నమోదుపై సమీక్ష సమావేశం నుంచి మంత్రి బొత్స  ఫోన్లో మాట్లాడారు. వారం రోజల్లో ఈ క్రాప్ బుకింగ్ చేయాలంటూ  పయ్యావుల కేశవ్ పట్టుబట్టారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.