
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR)పై ఎమ్మెల్యే రఘునందన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు మంత్రులు స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంత్రులు నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జీవితకాలం అధికారంలో ఉండాలని సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబం కోరుకుంటోందని దుయ్యబట్టారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని బీజేపీ అమలు చేసి తీరుతోందని స్పష్టం చేశారు. చైనా తరహా పాలన కావాలని, రాజ్యాంగాన్ని మార్చాలని అసెంబ్లీలో చర్చకు పెట్టగలరా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి