గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉర్దూలో పెట్టొద్దు: Mla Raja singh

ABN , First Publish Date - 2022-05-07T02:07:44+05:30 IST

గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉర్ధూలో కూడా పెడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనను బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.

గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉర్దూలో పెట్టొద్దు: Mla Raja singh

హైదరాబాద్: గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉర్ధూలో కూడా పెడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనను బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఎంఐఎంను సంతోష పెట్టడం కోసమే ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందన్నారు. ఉర్దూలో ఎగ్జామ్ పెడితే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అన్యాయం జరుగుతుందని అన్నారు.యువకులు ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు నేడు మంత్రులుగా ఉన్నారు. కేసీఆర్ ను తిట్టిన వ్యక్తి ఆయన పక్కన కూర్చున్నారుఅని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలే ఆరోపణలు చేస్తున్నారు.


భూ కబ్జా మంత్రి అని శ్రీనివాస్ గౌడ్ ను లోకల్ ప్రజలు అంటున్నారని విమర్శించారు.చూతే.. బాడకౌ.. కుక్క గా అంటూ మేం కూడా అనగలం కాని మాకు .. మా పార్టీ కి సంస్కారం ఉంది కాబట్టి మేం అలాంటి భాషను వాడమని అన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ బేవకూఫ్ మంత్రి అన్నారు. టీఆర్ఎస్ రజాకార్ల పార్టీ అని నడ్డా అన్న మాటలు కరక్టేనని రాజాసింగ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 8వ నిజాం నేను అవుతా అని ఆ మార్గంలో నడుస్తున్నాడని అన్నారు. 

Read more