
జనగామ: అధికారుల తీరుకు నిరసనగా అధికార పార్టీ ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ఘనపూర్లో ధర్నా చేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ఏర్పాటు చేయడం లేదని అధికారుల తీరును నిరసిస్తూ ధర్నానిర్వహించారు. దీంతో వరంగల్-హైదరాబాద్ హైవేపై రాకపోకలు స్తంభించి పోయాయి. ఎమ్మెల్యే ధర్నా స్థానికంగా సంచలనం సృష్టించింది.