పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Published: Mon, 27 Jun 2022 21:56:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యేమాట్లాడుతున్న ఎమ్మెల్యే రామిరెడ్డి

అల్లూరు, జూన్‌ 27 : అల్లూరుపేటలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నతపాఠశాలగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఆవరణాన్ని పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలగా అభివృద్ధి చెందడం హర్షించతగ్గ విషయమని, అదేవిధంగా దీనికి 15 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి, స్థానిక నాయకులు మేడా కృష్ణారెడ్డి, మధురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.