బసవేశ్వర ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే సమీక్ష

Jun 17 2021 @ 00:12AM
సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌, జూన్‌ 16 : బసవేశ్వర ఎత్తిపోతల పథకంపై ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నీటి పారుదలశాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. ప్రభుత్వం సర్వే పనుల కోసం రూ.11 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ భీం, డిప్యూటీ ఈఈ జలేందర్‌, ఏఈలు దిలీ్‌పకుమార్‌, నాగరాణి, ఆర్‌వీ అసోసియేట్‌ సర్వే బృందం బాధ్యులు సారథి, వెంకట్‌రెడ్డి, ఆత్మ చైర్మన్‌ రాంసింగ్‌, జడ్పీటీసీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. గంగాపూర్‌, ర్యాకల్‌ ప్రాజెక్టు మరమ్మతుకు రూ.15 లక్షల నిధులు మంజూరు చేయించినందుకు ర్యాకల్‌, గంగాపూర్‌, తుర్కపల్లి గ్రామాలకు చెందిన నాయకులు, రైతులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని సన్మానించారు. నాగల్‌గిద్ద మండలం శేరిదామర్‌గిద్దకు చెందిన మహిళా రైతు శోభమ్మ ఇటీవల మృతిచెందింది. బీమా పథకం ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును ఆమె కుమారుడు శివరాజ్‌కు బుధవారం అందజేశారు. 

Follow Us on: