అన్ని గ్రామాలకు బస్సు సర్వీసులు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-07-27T04:32:15+05:30 IST

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సర్వీ సులు నడపాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.

అన్ని గ్రామాలకు బస్సు సర్వీసులు ఇవ్వండి
ఆర్టీసీ డీఎంలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకట్రావు

దేవరపల్లి, జూలై 26: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సర్వీ సులు నడపాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. నిడదవోలు, కొవ్వూరు డిపో మేనేజర్లతో సోమ వారం ఆయన  సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సుల సంఖ్య పెంచాలన్నారు. నల్లజర్ల, దేవరపల్లి హైవే మీదుగా వెళ్తున్న సూపర్‌ లగ్జరి బస్సులను దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు గ్రామంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళ్లేల బస్సులు సంఖ్య పెంచే లా చూడాలన్నారు. కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు డిపో మేనేజర్లు గోపి, శ్రీరామ్‌కుమార్‌, సత్యమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:32:15+05:30 IST