మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే రోజా తిప్పలు..

Published: Tue, 29 Mar 2022 15:05:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే రోజా తిప్పలు..

అమరావతి: తొలి మంత్రి వర్గంలో రోజాకు అవకాశం రాలేదు. దీంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. తర్వాత ఆమెకు ఏపీఐఐసీ పదవి కట్టబెట్టారు. ఇక మరోసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని సీఎం జగన్ ప్రకటించడంతో రోజా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి మంత్రులుగా కొనసాగుతున్నారు. వారిలో నారాయణస్వామిని తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక  పెద్దిరెడ్డి కొనసాగుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేలు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. వారితోపాటు జూనియర్లు శ్రీనివాసులు, ద్వారకనాధ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. పెద్దిరెడ్డికి రోజాకు మధ్య రాజకీయ వైరం ఉంది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని రోజా పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం అటు రాజకీయంగా ప్రయత్నిస్తూనే.. వ్యక్తిగతంగా తన నమ్మకాలకు అనుగుణంగా ఆమె పూజలు, వ్రతాలు చేస్తున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.