కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-15T05:58:06+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు.

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకరరావు

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పెదకూరపాడు, మే 14: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే శంకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మదమంచి భవానీ శంకర్‌, సామాజిక వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ సుగుణ, వైసీపీ మండల కన్వీనర్‌ బెల్లంకొండ మీరయ్య, వైసీపీ నాయకులు ఈదా సాంబిరెడ్డి, కంకణాల శివాజీ, షేక్‌ బిలావర్‌, గణేష్‌ మాధవరావు, షేక్‌ భయంకర సుభానీ, షేక్‌ బాషా, బత్తుల రాజేంద్ర, షేక్‌ ఆదం షఫీ, నల్లమేకల సురేంద్ర, క్రాపా వీరసింహం, షేక్‌ యూసఫ్‌ తదితరులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-15T05:58:06+05:30 IST