కళాకారులకు వెన్నుదన్నుగా ఉంటా

ABN , First Publish Date - 2021-01-17T05:02:04+05:30 IST

రాజకీయాలు, సంఘాలు, పార్టీలతో సంబంధం లేకుండా కళాకారులకు వెన్నుదన్నుగా ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన వద్దకు రావచ్చని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పేర్కొన్నారు.

కళాకారులకు వెన్నుదన్నుగా ఉంటా
ప్రజ్వలిత వ్యవస్థ్థాపకుడు దుర్గాప్రసాద్‌కు నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్‌ తదితరులు

నాగళ్ల సంతాప సభలో ఎమ్మెల్యే శివకుమార్‌ 

తెనాలి టౌన్‌, జనవరి 16: రాజకీయాలు, సంఘాలు, పార్టీలతో సంబంధం లేకుండా కళాకారులకు వెన్నుదన్నుగా ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన వద్దకు రావచ్చని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పేర్కొన్నారు. సామాజిక, సాహితీ సంస్థ ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల వెంకటదుర్గా ప్రసాద్‌ సంస్మరణ సభను శనివారం బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో నిర్వహించారు. సభకు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి అధ్యక్షత వహించారు. తొలుత దుర్గా ప్రసాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ కళాకారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారన్నారు. తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని, తెలుగుభాష ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారన్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన సాహితీమూర్తుల చరిత్రలను ప్రస్తుత తరానికి తెలియజెప్పేందుకు తెనాలి సాహితీ స్రవంతిని నిర్వహించి సఫలీకృతమయ్యారన్నారు. సభలో పలువురు కళాకారులు దుర్గాప్రసాద్‌తో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, దీపాల సుబ్రహ్మణ్యం, పందిటి సుబ్బారావు, దేవిశెట్టి కృష్ణారావు, మేకతోటి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:02:04+05:30 IST