
అనంతపురం జిల్లా: పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఇటీవల పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. గుండె నాళాలు మూసుకుపోవడంతో డాక్టర్లు ఆయనకు స్టంట్ వేసినట్లు సమాచారం. శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.