వ్యవసాయ రంగానికి తోడ్పాటునివ్వండి

ABN , First Publish Date - 2021-07-24T06:31:20+05:30 IST

పూర్తి వ్యవసాయ ఆధారితమైన సంతనూతల పాడు నియోజకవర్గంలో రైతులు, రైతు కూలీల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రం గ అభివృద్ధికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే సుధా కర్‌బాబు, సీఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు. శుక్ర వారం మధ్యాహ్నం తాడేపల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు.

వ్యవసాయ రంగానికి తోడ్పాటునివ్వండి
సీఎం జగన్‌కు బొకే ఇస్తున్న ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

సుబాబుల్‌ కొనుగోలు జరగాలి 

చెక్‌డ్యాంల నిర్మాణ ం అత్యవసరం 

గుండ్లకమ్మ ప్రాజెక్టు పర్యావరణ  కేంద్రంగా అభివృద్ధి కావాలి

సీఎం జగన్‌ని కోరిన ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పూర్తి వ్యవసాయ ఆధారితమైన సంతనూతల పాడు నియోజకవర్గంలో రైతులు, రైతు కూలీల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రం గ అభివృద్ధికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే సుధా కర్‌బాబు, సీఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు. శుక్ర వారం మధ్యాహ్నం తాడేపల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. నియోజకవర్గంలో సామాజికవ నాలను సాగుచేసిన రైతులు ఉత్పత్తులు అమ్ము డు పోక పడుతున్న ఇబ్బందులను వివరించారు. సుబాబుల్‌, జామాయిల్‌ని గిట్టుబాటు ధరలకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గుండ్లకమ్మ నదిపై కీర్తిపాడు, చీర్వానుప్పలపాడు, ఇనమనమెల్లూరు, వెల్లంపల్లి గ్రామాల సమీపం లో ఐదు చెక్‌డ్యాంలను నిర్మించి సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తోడ్పడాలని కోరా రు. అలాగే  సంతనూతలపాడులోని ప్రధాన చె రువు అభివృద్ధికి రూ.7కోట్లను మంజూరు చేస్తూ నియోజకవర్గంలోని మైనర్‌ చెరువులను రిజర్వా యర్లుగా ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవా లని సూచించారు. మద్దిపాడు, నాగులుప్పలపా డులో శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్‌ కా ర్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని, నాలుగు మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ లలో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం అవసర మైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలా గే గ్రానైట్‌ పరిశ్రమలో విద్యుత్‌  వాడకంపై రా యితీ కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ఇ లా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల అవస రాలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 14కి పైగా అంశాలపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు లేఖ ఇవ్వగా సీఎం సానుకూలంగా స్పందించారు. అ ప్పటికప్పుడు సీఎంవో అధికారులకు తగిన ఆదేశా లు జారీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.


Updated Date - 2021-07-24T06:31:20+05:30 IST