Guntur: తాడికొండ Ysrcpలో ఆధిపత్య పోరు

ABN , First Publish Date - 2022-08-27T17:38:20+05:30 IST

తాడికొండ వైసీపీ(Ysrcp)లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక..ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(MLA Undavalli Sridevi)కి మద్దతుగా ర్యాలీకి

Guntur: తాడికొండ Ysrcpలో ఆధిపత్య పోరు

గుంటూరుః తాడికొండ వైసీపీ(Ysrcp)లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇక..ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(MLA Undavalli Sridevi)కి మద్దతుగా ర్యాలీకి ఓ వర్గం సిద్ధమైంది. మరొపక్క డొక్కాకు అనుకూలంగా మరోవర్గం నినాదాలు చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో పాటు నినాదాలు పెరిగాయి. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలతో చర్చలు మొదలుపెట్టారు. ఇరువర్గాలకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఇరువర్గాలకు పోలీసులు నచ్చజెపుతున్నారు. తాడికొండలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.



Updated Date - 2022-08-27T17:38:20+05:30 IST