విద్యార్థులకు వరం మన ఊరు.. మన బడి

ABN , First Publish Date - 2022-07-07T04:48:29+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థుల భవిష్యత్‌కై వారి అభ్యున్నతికై ప్రవేశపెట్టిన మన ఊరు - మనబడి విద్యార్థుల పాలిటవరంగా మారిందని ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు అన్నారు.

విద్యార్థులకు వరం మన ఊరు.. మన బడి
ప్రహరీ పనులను ప్రారంభిస్తున్న వనమా

అభివృద్ధి పనుల ప్రారంభంలో ఎమ్మెల్యే వనమా

పాల్వంచ టౌన్‌, జూలై 6: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థుల భవిష్యత్‌కై వారి అభ్యున్నతికై ప్రవేశపెట్టిన మన ఊరు - మనబడి విద్యార్థుల పాలిటవరంగా మారిందని ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు అన్నారు. మన బస్తీ, మనబడి కార్య క్ర మంలో భాగంగా పట్టణ పరిధిలోని పాలకోయతండా, వికలాం గుల కాలనీ, కరకవాగు పాఠశాలల్లో సుమారు రూ. 80లక్షల వ్యయంతో చేపట్టిన ప్రహరీగోడల నిర్మాణం, పాఠశాల మర మ్మతు, అదనపు సౌకర్యాల పనులను బుధవారం ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల్లోని పాఠశాలలకు సైతం వసతులను కల్పిస్తు భావితరాలకు గొప్ప వ్యక్తులుగా, సైటింస్టులు, వైద్యులు, ఐఎఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత విద్యను పొందే వ్యక్తులుగా, వి ద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఈ పథకం ప్రారంభించారని కొనియాడారు. 


Updated Date - 2022-07-07T04:48:29+05:30 IST