
హైదరాబాద్: తన కుమారుడు వనమ రాఘవ అరెస్ట్, ఆపై జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్ నిర్వహించిన ఎమ్మెల్యే... ‘‘రెండు నెలలు అనారోగ్యంతో బాధపడ్డా. నేను లేని సమయంలో నా కుమారుడు రాఘవపై కొందరు కుట్రలు పన్నారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావలసిన నా కుమారుడి రాజకీయ భవిష్యత్‌ను ఆగం చేశారు. నేను ఆరోగ్యంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తున్నా. నా కుమరునిపై కుట్రలు చేసిన వారి బండారం త్వరలోనే బయటపెడుతాను. మా పార్టీ వాళ్ళతో పాటూ ఇతర పార్టీల వారు కూడా కుమ్మక్కయ్యారు’’ అంటూ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు. కాగా.. ఖమ్మం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి వనమా రాఘవ 61 రోజుల పాటు జైళ్లో ఉండి.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవడంతో విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది.
ఇవి కూడా చదవండి