శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Sep 26 2021 @ 23:38PM
తిరుమలలో కుటుంబసభ్యులతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదివారం తిరుపతి వేంకటేశ్వరస్వామిని కుటుంబీకులు, సన్నిహితులతో కలిసి దర్శించుకున్నారు. తాండూరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

కరకాలమ్మ ఆలయం వద్ద అన్నదానం

శామీర్‌పేట:  మండల పరిధి బొమ్మరాశిపేట గ్రామ శివారులోని కరకాలమ్మ ఆలయం వద్ద కమిటీ సభ్యులు ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వై.ఎ్‌స.గౌడ్‌, తూంకుంట మున్సిపల్‌ అధ్యక్షుడు బీమిడి జైపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రవికిరణ్‌రెడ్డి, నాయకులు ఆంజనేయులు, ఆనంద్‌, భరత్‌, మల్లేష్‌, వెంకటేష్‌, వినోద్‌, బాబా, మహేష్‌ పాల్గొన్నారు.

కట్టమైసమ్మ ఆలయ నిర్మాణానికి విరాళం 

దోమ: మండలంలోని మోత్కూర్‌ గ్రామంలో ఆదివారం ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కేశవులు, ఉపాధ్యాయులు రామక్రిష్ణ, ఆనంద్‌, మల్లేశ్‌, చెన్నయ్య పాల్గొన్నారు.

Follow Us on: