గాంధీ సినిమాను ప్రారంభించిన ఎమ్మెల్యే : ఆల
ABN , First Publish Date - 2022-08-10T05:25:10+05:30 IST
75వ స్వా త్రంత్య దినోత్సవ వజ్రోత్సవ ఉత్సవా ల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ సినిమాను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.
దేవరకద్ర, అగస్టు 9 : 75వ స్వా త్రంత్య దినోత్సవ వజ్రోత్సవ ఉత్సవా ల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ సినిమాను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. రాఘవేంద్ర సినిమా థియోటర్లో సినిమాను ఎ మ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారం భించి, అనంతరం విద్యార్థులతో కలిసి తిలకించారు. స్వాతంత్య్ర ఉద్యమ చరి త్ర నేటితరం విద్యార్థులకు తెలియ డా నికి ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై జెండాలను ప్రదర్శించాలి
అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగుర వేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి. సూచించా రు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో ప్రజలకు జాతీయ పతాకాలను అందజే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ కొండ సుగుణ, సర్పంచ్ కొండ విజయలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సీఐ రజిత, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ జ్యోతి, ఈవో సీత్యానాయక్, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, కర్ణం రాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
సమస్యలపై వీఆర్ఏల వినతి
తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవా లని వీఆర్ఏలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. 15 రోజుల నుంచి సమ్మె చేస్తు న్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రం చేసేవిధంగా చూడాలని వీఆర్ఎలు ఎంపీడీవో కార్యాలయం దగ్గర వినతి పత్రాం అందజేశారు.
మొహర్రం వేడుకల్లో..
అడ్డాకుల : అడ్డాకుల మండల పరిధిలోని రాచాల లో మంగళవారం మొహర్రం సందర్భంగా నిర్వహిం చిన పీర్ల పండుగలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ ర్‌రెడ్డి పాల్గొని పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.