ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు నియామకం

ABN , First Publish Date - 2021-05-11T04:40:03+05:30 IST

పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ముగ్గురిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు నియామకం

యానాం, మే 10: పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ముగ్గురిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. అన్నాడీఎంకే నుంచి పోటీచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న కె.వెంకటేషన్‌, మాజీ స్పీకర్‌ శివకోలందు సోదరుడు వి.పి.రామలింగం, బీజేపీ న్యాయవాది ఆర్‌.బి.అశోక్‌బాబులు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలుగా నియమితులయ్యారు. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి (బీజేపీ 6, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10), కాంగ్రెస్‌ కూటమి (కాంగ్రెస్‌ 2, డీఎంకే 6), స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల నియామకంతో బీజేపీ బలం 9కి పెరిగింది.

Updated Date - 2021-05-11T04:40:03+05:30 IST