ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ను విజయవంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-03-02T05:13:57+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ను విజయవంతంగా నిర్వహించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ను   విజయవంతంగా నిర్వహించాలి

జయశంకర్‌ భూపాలపల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య

భూపాలపల్లి కలెక్టరేట్‌, మార్చి 1 : నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఇల్లందు క్లబ్‌హౌ్‌సలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులగా నియమించబడిన వారిని మాస్టర్‌ ట్రెనీల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కోవిడ్‌-19 నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల శిక్షణ ఇన్‌చార్జి అధికారి సామ్యూల్‌, మాస్టర్‌ ట్రైనీలు ఆంజనేయులు, మల్లికార్జునరెడ్డి, ఎలక్షన్‌ డీటీలు రవికుమార్‌, రవి పాల్గొన్నారు. అనంతరం మంజూర్‌నగర్‌ నిర్మిస్తున్న ఎలక్షన్‌ గోడౌన్‌ నిర్మాణ పనులను, జిల్లా ఆస్పత్రిని ఇన్‌చార్జి కలెక్టర్‌ సందర్శించారు.



Updated Date - 2021-03-02T05:13:57+05:30 IST