Anantha Babu case: ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలి: బాధితులు

ABN , First Publish Date - 2022-08-04T20:48:25+05:30 IST

మ్మెల్సీ అనంతబాబుపై నమోదైన కేసును సీబీఐకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తూ..

Anantha Babu case: ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలి: బాధితులు

అమరావతి (Amaravathi): దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య (Subrahmanyam murder) వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantababu)పై నమోదైన కేసును సీబీఐ (CBI)కు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తూ.. హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. హత్య కేసులో అనంతబాబుతోపాటు మరో ఐదుగురి ప్రమేయం ఉందని పిటిషనర్ ఆరోపించారు. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని అన్నారు. బాధితుల తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. 


ఎమ్మెల్సీ అనంతబాబుపై 12 క్రిమినల్‌ కేసులు, రౌడీ షీటు  ఓపెన్‌ చేయాలని.. ఏఎస్పీ సిఫార్సు చేసిన అంశాన్ని న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే అనంతబాబుపై క్రిమినల్‌ రికార్డ్‌ లేదని చెప్పారని పోలీసులు వాదనలు వినిపించారు. దీంతో కస్టడీ పిటిషన్‌ వేసిన విషయాన్ని శ్రావణ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగితే న్యాయం జరగదని, అందుకే సీబీఐకు అప్పగించాలని కోరుతున్నట్లు శ్రావణ్ కుమార్ అన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం కేంద్రం, సీబీఐ, డీజీపీ, కాకినాడ ఎస్పీకి నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2022-08-04T20:48:25+05:30 IST