ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

ABN , First Publish Date - 2022-06-07T00:03:00+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ మరో 14 రోజులకు పెరిగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయనకు తొలి రిమాండ్ పూర్తి అయింది. దీంతో ...

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ మరో 14 రోజులకు పెరిగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయనకు తొలి రిమాండ్ పూర్తి అయింది. దీంతో అనంతబాబు రిమాండ్‎ను పొడిగించాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు మెమో ఎక్స్ టెన్షన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి అనంతబాబు రిమాండ్‌ను ఈ నెల 20 వరకూ పొడిగించారు. అయితే అనంతబాబుకు బెయిల్ కోరుతూ ఈ నెల 1న లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎ మంగళవారం విచారణకు రానుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Updated Date - 2022-06-07T00:03:00+05:30 IST