ముఖ్యమంత్రికి బీసీలపై గౌరవం లేదు

ABN , First Publish Date - 2020-11-30T05:03:43+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బీసీలు, దళితులపై ఎంతమాత్రం గౌరవం లేదని టీడీపీ రాష్ట్ర ఆరనైజింగ్‌ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు.

ముఖ్యమంత్రికి బీసీలపై గౌరవం లేదు

ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌


పాలకొల్లు అర్బన్‌, నవంబరు 29 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బీసీలు, దళితులపై ఎంతమాత్రం గౌరవం లేదని టీడీపీ రాష్ట్ర ఆరనైజింగ్‌ కార్యదర్శి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. ఆయన నివాసంలో ఆది వారం విలేకర్ల సమావేశంలో అంగర మాట్లాడారు. ఇటీవల కాకినాడలో మాజీ డిప్యూటి సీఎం, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌పై ఎమ్మె ల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరుష పదజాలంతో దూషించారన్నారు. రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆగ్రహంతో సీఎం క్యాంపు కార్యాలయంలో బోస్‌, చంద్రశేఖరరెడ్డిలకు పంచాయితీ పెట్టారన్నారు. సీనియర్‌ అయిన రాజ్యసభ సభ్యుడు తన కంటె జూనియర్‌ అయిన ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసానికి వెళ్ళి కండువా కప్పించుకుని మేము కలిసి పోయామని చెప్పడం ఎంత వరకూ సమజసమని ఎమ్మెల్సీ అంగర ప్రశ్నించారు. ఈపరిణామాలు చూ స్తుంటే సీఎం జగన్‌ వర్గానికి చెందిన చంద్రశేఖరరెడ్డిని కాపాడడానికే బీసీ అయిన బోస్‌తో రాజీ చేసినట్టు ఉందని, ఇటువంటి అంశాలపై రాష్ట్రంలోని బీసీ సంఘాలు ఎంత మాత్రం సంతృప్తితో లేవన్నారు. సీఎం జగన్‌కు బీసీ లు, దళితులు, మైనార్టీలపై ఎంతమాత్రం గౌరవం లేదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, బీసీలపై జరుగుతున్న దాడులే దీనికి నిదర్శనం అని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌, ఆపార్టీ నాయకుల్లో మార్పు రావాలని అంగర రామ్మోహన్‌ సూచించారు.

Updated Date - 2020-11-30T05:03:43+05:30 IST