ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-05-23T06:47:03+05:30 IST

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడి హత్యకేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అరెస్ట్‌ చేయాలని టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోకవరం బస్టాండ్‌ దగ్గరలోని అంబేద్కర్‌ విగ్రహం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తంచేశారు.

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి
గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేస్తున్న టీడీపీ నాయకులు

  • దళితులపై దాడులు ఆగేవరకూ పోరాటం 
  • అనంతబాబును తప్పించేందుకు ప్రభుత్వం, పోలీసుల ప్రయత్నాలు
  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజు

రాజమహేంద్రవరం, మే22(ఆంధ్రజ్యోతి): తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడి హత్యకేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అరెస్ట్‌ చేయాలని టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి  గోకవరం బస్టాండ్‌ దగ్గరలోని అంబేద్కర్‌ విగ్రహం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తంచేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ దళితులపై దాడులు ఆగే వరకూ పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దళితులను మనుషులుగా కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారన్నారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ ఈ కేసు నుంచి అనంతబాబును తప్పించడానికి అధికార పార్టీనేతలు, పోలీసులు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారని, టీడీపీ, ప్రజాసంఘాలు అడ్డుకోవడం వల్లే పోస్టుమార్టం చేసి, కేసు నమోదు చేశారన్నారు. సుబ్రహ్మణ్యంను హత్యచేసిన సమయంలో అతని కారు తిరిగిన వీధుల్లోని సీసీ కెమెరాల పుటేజీలను ఇప్పటికీ బయటపెట్టడంలేదని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి  పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీ నాయకులు, ఆదిరెడ్డి అప్పారావు, యర్రా వేణుగోపాల్‌రాయుడు, కాశి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీని ప్రశ్నించడానికే పోలీసులు భయపడుతున్నారన్నారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే దాడులకు తెగబడడం, వారి అభద్రతా భావాన్ని బయటపెడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ సుభాన్‌, మాలే విజయలక్ష్మి,  దాస్యం ప్రసాద్‌, మహబూబ్‌ఖాన్‌, బంగారు నాగేశ్వరరావు, బొర్రా చిన్న, కల్పల వెలుగుకుమారి, మీసాల నాగమణి,  కోసూరి చండీప్రియ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:47:03+05:30 IST