పకడ్బందీగా..ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-09-30T06:21:08+05:30 IST

‘నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం పకడ్బందీ ఏర్పాట్లను చేశాం. కేంద్ర ఎన్నికల కమిషన్‌

పకడ్బందీగా..ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు

పోలింగ్‌ కేంద్రాలు 50కి పెంపు

నేడు పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి


నిజామాబాద్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం పకడ్బందీ ఏర్పాట్లను చేశాం. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలను పెంచాం. పోలింగ్‌ జరిగే అక్టోబరు 9న కొవిడ్‌ నిబంధనలను పాటిస్తాం. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజా ప్రతిప్రతినిధులు, పార్టీల నేతలు సహకరించాలి..’ అని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు. వివరాలు ఇలా..


ఆంధ్రజ్యోతి: ఉమ్మడి జిల్లా పరిధిలో కరోనా ప్రభావం దృష్ట్యా  ఉప ఎన్నిక కోసం పోలింగ్‌ కేంద్రాలను పెంచారా?

అధికారి : కరోనాకు ముందు ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్‌ ఆరు పోలింగ్‌ కేంద్రాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్‌డీవోల పరిధిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కరోనా తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాలను పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాం. ప్రస్తుతం మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో 28, కామారెడ్డి జిల్లా పరిధిలో 22 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఆయా మండలాల పరిధిలోని ఎంపీడీవో కేంద్రాలలో ఏర్పాటు చేశాం. ఆయా మండలాల పరిధిలోని ఉప ఎన్నిక ఓటర్లు అదే మండలంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. కరోనా ఉన్నందున ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచుతాం. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే వారు తప్పనిసరి మాస్కులు ధరించి రావాలి. పోలింగ్‌ నిబంధనలు అన్ని పాటించాలి.


ఆంధ్రజ్యోతి : ఈ ఉప ఎన్నికలు బ్యాలెట్‌ ద్వారా జరుగుతున్నాయి. వీటి కోసం ఏర్పాట్లను చేశారా?

అధికారి : స్థానిక సంస్థల ఎన్నిక కావడం.. ఓటర్లు తక్కువగా ఉన్నందున బ్యాలెట్‌ ద్వారానే ఎన్నిక నిర్వహిస్తున్నాం. ఈ ఉప ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి పార్టీలకు అనుగుణంగా గుర్తులు ఉంటాయి. నిబంధనల ప్రకారమే బ్యాలెట్‌ పేపరులో వారికి కేటాయింపులు ఉంటాయి. ఈ ఉప ఎన్నిక కోసం నిర్వహించిన రాజకీయ పార్టీ సమావేశంలో వారికి ఇప్పటికే వివరించాం. పోలింగ్‌కు కావాల్సిన బ్యాలెట్‌ బాక్సులను సమకూర్చాం.     


అంధ్రజ్యోతి : ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మోడల్‌ కోడ్‌ అమలు చేస్తున్నారా?

అధికారి : ఉమ్మడి జిల్లా పరిధిలో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చిన రోజు నుంచే మోడల్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది. దీని కోసం ప్రత్యేక అధికారులను నియ మించాం. రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. తమ కు సహకరించాలని కోరాం. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎన్ని కల కోడ్‌ కొనసాగు తోంది. పార్టీలు, పోటీ చేసే అభ్యర్థు లు కూడా నిబంధన లు పాటించాలి. ముఖ్యంగా కొవిడ్‌ నిబంధనలు పాటి స్తూ ప్రచారం చేసుకోవాలి. ఈ ఉప ఎన్నిక కోసం నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాం.


ఆంధ్రజ్యోతి : ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఎక్కడ జరుగుతుంది?

అధికారి : ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కోసం కావా ల్సిన ఏర్పాట్లను చేశాం. నిజా మాబాద్‌ పాలిటెక్నిక్‌ కేంద్రం లోనే రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రా లను ఏర్పాటు చేశాం. ఉప ఎన్నిక జరిగే అక్టోబరు 9కి ఒక రోజు ముందు పోలింగ్‌ సామగ్రి కూడా ఇక్కడి నుంచే తీసుకవెళుతారు. పోలింగ్‌ పూర్తి అయినా తర్వాత బ్యాలెట్‌ బాక్సులను ఇక్కడికే తీసుకవస్తారు. అక్టోబరు 12న కౌంటింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలోనే జరుగుతుంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూంలను కూడా  పాలిటెక్నిక్‌లోనే చేశాం. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చాం.


ఆంధ్రజ్యోతి : ఈ ఉప ఎన్నిక కోసం భద్రత ఏర్పాట్లను ఎలా చేశారు?

అధికారి : ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అన్ని రకాల భద్రత చర్యలను చేపట్టాం. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాం. నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌, కామారెడ్డి ఎస్పీ ఆధ్వర్యంలో ఈ భద్రత ఏర్పాట్లను చేస్తున్నాం. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ మండలంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసినందున అక్కడి పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగేందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు. మోడల్‌ కోడ్‌ అమలులో ఉన్నందున అందరూ నిబంధనలు పాటించాలన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తప్పనిసరి మాస్కులు ధరించి భాతిక దూరం పాటించాలని కోరారు.


ఆంధ్రజ్యోతి: వాయిదా పడిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

అధికారి : ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గత ఏప్రిల్‌ నెలలో పూర్తి కావాల్సింది. కొవిడ్‌ వ్యాప్తి చెందడం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్‌ వాయి దా వేసింది. ఈ ఎన్నికలో పాత ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల కు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపాలి టీలలో నమోదు అయినా ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 824 మంది ఓటర్లు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నారు. కేంద్ర ఎన్ని కల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించిన విధంగానే ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఎన్నిక కోసం ఏర్పాట్లను చేస్తున్నాం. అక్టోబరు 9న పోలింగ్‌, 12న కౌంటిం గ్‌ నిర్వహిస్తున్నాం. ఈ ఉప ఎన్నికకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాం.


ఆంధ్రజ్యోతి : ఈ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్టోబరు 9న  జరుగుతుంది. పోలింగ్‌ కోసం సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చా రా?

అధికారి :  గత షెడ్యూల్‌లో కేవలం ఆరు పోలింగ్‌ కేంద్రాలు ఉండేవి. అప్పుడు వారికి తగిన శిక్షణ ఇచ్చాం. కరోనా సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ 50కి పెంచింది. పోలింగ్‌ సిబ్బందికి బుధవారం శిక్షణ ఇస్తున్నాం. నిజామాబాద్‌ లోని 28 కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి నిజామాబాద్‌ లోనే శిక్షణ ఇస్తున్నాం. అలాగే కామారెడ్డి పరిధిలోని 22 పోలింగ్‌ కేంద్రాల సిబ్బందికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే శిక్షణ ఇస్తున్నాం. వీరందరికి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తునే శిక్షణ ఏర్పాటు చేశాం.

Updated Date - 2020-09-30T06:21:08+05:30 IST