ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీబిజీ

ABN , First Publish Date - 2020-10-01T10:12:47+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్ని కల నిర్వహణలో అధికారులు బిజీబిజీ అయ్యారు. ఎన్నికల సంఘం సైతం ఉపపోరు పర్యవేక్షణ కోసం వీరబ్రహ్మయ్యను ఎన్నికల పరిశీలకులుగా నియమి ంచింది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీబిజీ

ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు

ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్‌లను ప్రకటించిన అధికారులు

ఎన్నికల పరిశీలకుడిగా వీరబ్రహ్మయ్యను నియమించిన ఎన్నికల కమిషన్‌

ఉమ్మడి జిల్లాలో 50 పోలింగ్‌ కేంద్రాలు.. 824 ఓట్లు

ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌లు, కార్పోరేటర్లు

ఎక్స్‌ అఫీషియో కింద ఓటు వేయనున్న ఎమ్మెల్యేలు

ఈ నెల 9న పోలింగ్‌


కామారెడ్డి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్ని కల నిర్వహణలో అధికారులు బిజీబిజీ అయ్యారు. ఎన్నికల సంఘం సైతం ఉపపోరు పర్యవేక్షణ కోసం వీరబ్రహ్మయ్యను ఎన్నికల పరిశీలకులుగా నియమిoచింది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలను, ఓటరు జాబితాను ఇరు జిల్లాల అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 824 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపపోరు సందర్భ ంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు జిల్లాల్లోని పోలీస్‌ శాఖల ఉన్నతాధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నియమించేం దుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక పోలింగ్‌ రోజు ఆయా పోలింగ్‌ కేంద్రాలలో బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాలతో పాటు ఇతర సామగ్రిని సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలలో విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓలకు శిక్షణ కార్యక్ర మాలు సైతం నిర్వహించారు.


ఈ నెల 9న ఎమ్మెల్సీ పోలింగ్‌

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు గత మార్చి 15న నోటిఫికేషన్‌ జారీ అయింది. అదే నెల 19న నామి నేషన్‌లు ముగిశాయి. ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యం లో రెండుసార్లు పోలింగ్‌ వాయిదా పడింది. గత ఆరు నెలల కాలం తర్వాత ఎన్నికల సంఘం నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అక్టోబరు 9న పోలింగ్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఎన్నికల పరిశీలకుడిగా వీరబ్రహ్మయ్యను నియమించిం ది. పరిశీలకుడు బుధవారం కామారెడ్డి జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని జన హితభవన్‌లో ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల అధికారులు ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


50 పోలింగ్‌ కేంద్రాలు.. 824 ఓట్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ల నుంచి మాజీ ఎంపీ కవిత, వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, పోతన్‌కర్‌ లక్ష్మీనా రాయ ణలు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థలైన మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లోని కౌన్సిలర్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఎన్నికైన వారు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఆయా ఓటర్లు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి ఎన్ను కుంటారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఎక్స్‌ అఫీషియో ఓట్లు కలుపుకొని మొత్తం 824 ఓట్లు ఉన్నాయి. వీరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఇరు జిల్లాల్లో 50 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 28 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 483 ఓట్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 341 ఓట్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలలోని మున్సిపల్‌ కార్యాలయాల్లో పోలి ంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆయా మండల కేంద్రాల్లోనూ మండల, జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.


నిజామాబాద్‌ జిల్లాలో ఓట్ల వివరాలు 

నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ మూడు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో మొత్తం 28 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 483 ఓట్లు ఉన్నాయి. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 175 ఓట్లు ఉండగా ఇందులో నిజామాబాద్‌ రూరల్‌లో 76 ఓట్లు ఉండగా ఎంపీటీసీల ఓట్లు 8, జడ్పీటీసీ1, కార్పోరేటర్లు 60 మంది, ఎక్స్‌ అఫీషియో ఓట్లు 7, మోపాల్‌ మండల పరిధిలో మొత్తం 12 ఓట్లు ఉండగా 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, డిచ్‌పల్లిలో మొత్తం 18 ఓట్లు ఉండగా 17 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, ఇందల్వాయిలో 12 ఉండగా 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, నవీపేట్‌లో 17 ఓట్లు ఉండగా 16 ఎంపీటీసీ, ఒకటి జడ్పీటీసీ, ధర్పల్లిలో 12 ఓట్లు ఉండగా 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, మాక్లూర్‌లో 15 ఓట్లలో 14 ఎంపీటీసీ, జడ్పీటీ సీ 1, సిరికొండలో 13ఓట్లు ఉండగా 12 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, బోధన్‌ సబ్‌ డివిజ న్‌ పరిధిలో 122ఓట్లు ఉన్నాయి. ఇందులో బోధన్‌ మున్సిపాలిటీలో 57 ఓట్లలో 17 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, 38 మంది కౌన్సిలర్‌లు, ఒక ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నా యి. రెంజల్‌లో 12 ఓట్లకు 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, ఎడపల్లిలో 12 ఓట్లలో 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, కోటగిరిలో 15 ఓట్లలో 14 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, రుద్రూర్‌ లో 7 ఓట్లలో 6 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, వర్ని 10 ఓట్లలో 9 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, చందూర్‌లో 4 ఓట్లలో 3 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, మోస్రాలో 5 ఓట్లలో 4 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయి. ఆర్మూర్‌ రెవెన్యూ డివిజనల్‌ 186 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఆర్మూర్‌లో మొత్తం 53 ఓట్లలో 16 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, 36 మంది కౌన్సిలర్‌లు ఉన్నారు. నందిపేటలో 21 ఓట్లు ఉండగా 20 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, బాల్కొండలో 10 ఓట్లు ఉండగా 9 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, మోపాల్‌ లో 7 ఓట్లలో 6 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, మెండోరలో 9 ఓట్లలో 8 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, మెర్తాడ్‌లో 11 ఓట్లలో 10 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, ఎర్గట్లలో 6 ఓట్లలో 5 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, కమ్మర్‌పల్లిలో 13 ఓట్లలో 12 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, భీమ్‌గల్‌లో 28 ఓట్లలో 14 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, 12 మంది కౌన్సిలర్‌లు, ఒకటి ఎక్స్‌అఫీషియో, వేల్పూర్‌లో 14 ఓట్లలో 13 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, జక్రాన్‌పల్లిలో 14 ఓట్లలో 13 ఎంపీటీసీ, ఒకటి జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయి


కామారెడ్డి జిల్లాలో ఓట్ల వివరాలు

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో 341 ఓట్లు ఉన్నాయి. కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 147 ఓట్లు ఉన్నాయి. ఇందులో కామారెడ్డిలో 57 ఓట్లు ఉండగా ఎంపీటీసీ 6, జడ్పీటీసీ 1, కౌన్సిలర్‌లు 49, ఎక్స్‌ అఫీషియో ఓటు ఉంది. భిక్కనూర్‌లో 15 ఓట్లలో 14 జడ్పీ టీసీ, 1 ఎంపీటీసీ, బీబీపేటలో 8 ఓట్లలో 7 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, దోమకొండలో 10 ఓట్లలో 9 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, మాచారెడ్డిలో 14 ఓట్లలో 13 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, రాజంపేటలో 9 ఓట్లలో 8 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, రామారెడ్డిలో 11 ఓట్లలో 10 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, సదాశివనగర్‌లో 13 ఓట్లలో 12 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, తాడ్వాయిలో 10 ఓట్లలో 9 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌లో 131 ఓట్లు ఉండగా ఇందులో మద్నూర్‌లో 18 ఓట్లలో 17 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, జుక్కల్‌లో 16 ఓట్లలో 15 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, పిట్లంలో 14 ఓట్లలో 13 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, నస్రూల్లాబాద్‌లో 9 ఓట్లలో 8 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, బీర్కూర్‌లో 8 ఓట్లలో 7 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, బాన్సువాడలో 32 ఓట్లలో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, 19 కౌన్సిలర్‌లు, ఒక ఎక్స్‌ అఫీషియో ఓటు, బిచ్కుందలో 15 ఓట్లలో 14 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, పెద్దకొడప్‌గ ల్‌లో 7 ఓట్లలో 6 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, నిజాంసాగర్‌లో 12 ఓట్లలో 11 ఎంపీ టీసీ, 1 జడ్పీటీసీ, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో 63 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఎల్లారెడ్డిలో 22 ఓట్లు ఉండగా 8 ఎంపీటీసీ, జడ్పీటీసీ 1, 12 కౌన్సిలర్‌లు, ఎక్స్‌ అఫీషియో 1, నాగిరెడ్డిపేటలో 10 ఓట్లలో 9 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, లింగంపేటలో 15 ఓట్లలో 14 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, గాంధారిలో 16 ఓట్లలో 15 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయి.

Updated Date - 2020-10-01T10:12:47+05:30 IST