ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ABN , First Publish Date - 2020-10-08T19:05:59+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార గడువు బుధవారం ముగిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా బ్యాలెట్‌ బాక్సుల ఏర్పాటుతో పాటు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

నేడు పోలింగ్‌ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది

రేపే 50 కేంద్రాల్లో ఉప ఎన్నిక పోలింగ్‌

కరోనా పాజిటివ్‌ ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు

పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లను చేశాం : రిటర్నింగ్‌ అధికారి సి.నారాయణరెడ్డి


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార గడువు బుధవారం ముగిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా బ్యాలెట్‌ బాక్సుల ఏర్పాటుతో పాటు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఉప ఎన్నిక కోసం నేడు పోలింగ్‌ సిబ్బం దిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లను చేశారు. భారీ బందోబస్తును పోలింగ్‌ కేంద్రాల వద్ద చేశారు. ఈ పోలింగ్‌ కోసం జోనల్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం గడువు బుధ వారంతో ముగిసింది. నేడు పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు తరలనున్నారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవా రం జరుగనుంది. ఈ ఎన్నికలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకు ంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 824మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో 483 మంది నిజామా బాద్‌ జిల్లాలో ఉండగా 341 మంది కామారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఈ ఓటర్లలో అత్యధికంగా నిజామాబాద్‌ కార్పోరేషన్‌ లో 67 మంది ఉన్నారు. వీరు జడ్పీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో రెండు ఓట్లు జిల్లా విభజనతో సిరిసిల్లా జిల్లాలో ఉండగా ఒక ఓటు సంగారెడ్డి జిల్లాలో ఉంది. 


ఉప ఎన్నిక కోసం 50 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఈ ఉప ఎన్నిక కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లా పరిఽధిలో 28, కామారెడ్డి జిల్లా పరిఽధిలో 22 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కువగా మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కోసం కావల్సిన వసతులు కల్పించారు. ఇప్పటికే ఈ కేంద్రా లను అధికారులు పరిశీలించారు. పోలింగ్‌ సందర్భంగా ఏ విధమైన సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్ల అనుమతి ఇవ్వలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రతీ ఒక్కరికి టెంపరేచర్‌ చెక్‌ చేయనున్నారు. మాస్కు లు, గ్లౌజులు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.


పోలింగ్‌ నిర్వహణకు 399 మంది సిబ్బంది నియామకం

ఉమ్మడి జిల్లా పరిధి లో ఈ పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయ ంత్రం ఐదు గం టల వరకు జరుగనుంది. ఈ పోలింగ్‌ కోసం 399 మంది సిబ్బందిని నియ మించారు. ఈ ఉప ఎన్నిక కోసం ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక పోలింగ్‌ అధికారి, ఇద్దరు సహాయకులను నియ మించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఈ ముగ్గురి తో పాటు వెబ్‌కాస్టింగ్‌ కోసం ఒక్కొక్కరిని నియమించారు. వీరితో పాటు ప్రతీ పోలింగ్‌ కేంద్రం పరిధిలో మైక్రో అబ్జర్వర్లను నియమిం చారు. వీరే కాకుండా పోలింగ్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు 15 మంది రూట్‌ అధికారులను నియమించారు. వీరితో పాటు సెక్టోరియల్‌ అధికారులను నియమించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరం పడితే సహాయం అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను గుర్తించేందుకు అధికారులను నియమించారు. మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో పాటు ఇతర అధికారులను నియమించారు.


కరోనా ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లా పరిధిలో కరోనా తీవ్రంగా ఉండడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించడంతో పోలింగ్‌ సిబ్బంది నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఉప ఎన్నికలో ఓటు వినియోగించు కునే వారిలో 24 మంది కరోనా ఉన్న వారిని గుర్తిం చారు. వీరికి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వారి కి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేం దుకు అవకాశం కల్పించారు. కరోనా పాజిటివ్‌ వచ్చే పోలింగ్‌ కేంద్రాల వద్ద పీపీ కిట్లను అందుబాటులో ఉంచారు. వీరితో పాటు మెడికల్‌ సిబ్బందిని కూడా సహాయం కోసం నియమించారు.


నేడు పోలింగ్‌ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది

ఉమ్మడి జిల్లా పరిధిలో శుక్రవారం జరిగే ఉప ఎన్నికకు గురువారం పోలింగ్‌ కేంద్రా లకు సిబ్బందిని తరలించ నున్నారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి పోలింగ్‌ సామగ్రిని తీసుకొని వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లా కోసం పాలిటెక్నిక్‌లోనే రిసెప్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు ఇతర మెటీరియల్‌ అందిస్తారు. పోలింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా వీరిని పోలింగ్‌ కేంద్రాలకు తరలి స్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత అన్ని బాక్సులను మళ్లీ పాలిటెక్నిక్‌ కళాశాలకు తీసుకవచ్చి స్ట్రాంగ్‌ రూంలో భద్రప రుస్తారు.


ఉప ఎన్నిక కౌంటింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలోనే..

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కూడా పాలిటెక్నిక్‌ కళాశాలలోనే ఈనెల 12న నిర్వహిస్తారు. ఉదయం 8 గంట లకు ఈ కౌంటింగ్‌ మొదలు పెట్టనున్నారు. దీని కోసం ఆరు టేబుళ్లను ఏర్పాట్లను చేశారు. రెండు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అధికారులు కౌంటింగ్‌కు కావాల్సిన సదుపాయాలను సమకూ ర్చుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సూచనలకు అనుగుణ ంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు.


ఉప ఎన్నిక కోసం భారీ భద్రత ఏర్పాట్లు

ఈ ఉప ఎన్నిక కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతీ మండల కేంద్రంలోనే పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో అక్కడి పోలీసులతో భద్రత చేపడుతు న్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు వీడియో ద్వారా చిత్రీకరణ చేయను న్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్‌ కమిషనర్‌, ఎస్పీలు ఈ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయా సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఏసీపీలు, డీఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అవసరం ఉన్న చోట ఇతర బలగాలను వినియోగించనున్నారు. పోలింగ్‌ ప్రశాంతం గా జరిగేందుకు చర్యలు చేపట్టారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో వంద మీటర్ల లోపు ఓటర్లను మినహా ఎవ్వరిని అనుమతించకుండా చర్యలు చేపట్టారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఈ చర్యలు చేపట్టామని పోలీస్‌ అధికారు లు తెలిపారు.


ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్‌ అధికారి సి.నారాయణరెడ్డి

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రిటర్నిగ్‌ అధికారి సి.నారాయణరెడ్డి అన్నారు. ఆయన బుధ వారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదే శాలకు అనుగుణంగా పారదర్శకంగా జరిగే విధంగా చూస్తున్నామన్నారు. సిబ్బందికి కావాల్సిన శిక్షణ ఇచ్చామన్నా రు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద కరోనా దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్ల ను చేశామన్నారు. ప్రతీ ఒక్కరికీ టెంపరేచర్‌ చూసిన తర్వాత నే లోనికి అనుమతి ఇస్తామన్నారు. మాస్కులు తప్పనిసరి ధరించాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద వీటిని అందు బాటులో ఉంచామన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. పీపీ కిట్లను ఇవ్వడంతో పాటు వారికి అంబులెన్సులను సమకూర్చుతున్నామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘట నలు జరుగకుండా 144 సెక్షన్‌ విధించామని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వైన్స్‌ షాపులను బుధవారం సాయం త్రం నుంచే 48 గంటలు పాటు మూసి ఉంచుతున్నామన్నారు. పోలిం గ్‌తో పాటు కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లను చేశా మని తెలిపారు. 

Updated Date - 2020-10-08T19:05:59+05:30 IST