క్రాస్ ఓటింగ్‌పై గులాబీ పార్టీలో చర్చ

ABN , First Publish Date - 2021-12-15T21:15:06+05:30 IST

లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

క్రాస్ ఓటింగ్‌పై గులాబీ పార్టీలో చర్చ

హైదరాబాద్: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆరు స్థానాల్లో గంపగుత్తగా తమకే ఓట్లు పడతాయని భావించిన టీఆర్ఎస్‌కు చుక్కెదురైంది. అన్ని ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నా.. పలు చోట్ల జరిగిన క్రాస్ ఓటింగ్‌పై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం మొదలుపెట్టినట్లు సమాచారం.


ఉత్కంఠగా మారిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో విజయం సాధించినా.. పలు చోట్ల క్రాస్ ఓటింగ్ పార్టీలో అసంతృప్తిని రాజేసింది. సొంతపార్టీ ప్రజా ప్రతినిధులు, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. 15 రోజుల పాటు క్యాంపులు నిర్వహించి, తాయిళాలు ఇచ్చినా.. పలు చోట్ల ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూడడం పార్టీ ముఖ్యనేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2021-12-15T21:15:06+05:30 IST