ఎమ్మెల్సీ ఐవీకి క్షమాపణ చెప్పాలి

Sep 26 2021 @ 23:26PM
పెద్దాపుర మున్సిపల్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహిసున్న నాయకులు

పెద్దాపురంలో ప్రజా సంఘాల నాయకుల నిరసన

పెద్దాపురం, సెప్టెంబరు 26: ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ)కు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్షమాపణ చెప్పాలని కోరుతూ పలు ప్రజా సంఘాల నాయకులు పట్టణంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌన్సిల్‌ సభ్యుడు సీతారామారావు మాట్లాడుతూ సమస్యలను ప్రశ్నిస్తే విష్ణు తట్టుకోలేకపోయారని విమర్శించారు. తక్షణమే ఆయన ఎమ్మెల్సీ ఐవీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో దారపురెడ్డి క్రాంతికుమార్‌, కూనిరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.


కాకినాడలో...

భానుగుడి(కాకినాడ): ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్షమాపణ చెప్పాలని ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కాకినాడలో నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ ఉద్యోగుల పక్షాన వారి సమస్యలపై మాట్లాడిన ఐవీపై మల్లాది విష్ణు తీవ్రపదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. తక్షణం క్షమాపణ చెప్పకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో లోవతల్లి, భాను, సూర్య, సాయి, ప్రజా నాట్యమండలి నాయకులు గుత్తల శ్రీనివాసరావు, సీఐటీయూ నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ, డీవైఎ్‌ఫఐ నాయకులు చిత్తూరి విజయకుమార్‌, ఐద్వా నాయకురాలు నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.