Advertisement

సంక్షేమ పథకాలకు గల్ఫ్‌ కార్మికులు అర్హులు కాదా?

Sep 27 2020 @ 05:43AM

పట్టబధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


రాయికల్‌, సెప్టెంబరు 26: గల్ఫ్‌ కార్మికుల చెమటతో విదేశీ మారక ద్రవ్యం రూపంలో రాష్ట్ర ఖజానా నింపుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం చేయడానికి అర్హులుగా గుర్తించడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఇటీ వల దుబాయ్‌లో గుండె పోటుతో మరణించిన తోకల చిన్న నర్సయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం రాయికల్‌లో విలే కరులతో మాట్లాడుతూ గతంలో గల్ఫ్‌లో మృతిచెందిన కా ర్మికులకు రూ. లక్ష ఆర్ధిక సాయం అందించామన్నారు. గల్ఫ్‌ కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయుష్‌మాన్‌ భారత్‌ పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నాయకులు గోపిరాజరెడ్డి, రవీంధర్‌రావు,  మురళి, దివాకర్‌, మ హిపాల్‌, శ్రీకాంత్‌, షాఖీర్‌, రమేష్‌, నర్సయ్య, ఆది రెడ్డి, రాజేంధర్‌, రమేష్‌, నరసింహరెడ్డి, రుక్కు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement