జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-01-25T00:21:01+05:30 IST

జాతీయత మనందరికీ ఆత్మ వంటిదని, సాహిత్య ప్రక్రియల ద్వారా జాతిని అభ్యుదయం వైపు నడిపించే విధంగా ఆలోచనలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. '

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: జాతీయత మనందరికీ ఆత్మ వంటిదని, సాహిత్య ప్రక్రియల ద్వారా జాతిని అభ్యుదయం వైపు నడిపించే విధంగా ఆలోచనలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 'మెతుకు ‌సీమ సాహితీ‌ సాంస్కృతిక సంస్థ- సంగారెడ్డి' వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తుహాలులో 610కవుల భాగస్వామ్యంతో జరిగిన 'పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్సంకలనం ఆవిష్కరణోత్సవం'లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాటాడుతూ ప్రజలను, పద్యాలను సమాన స్థాయిలో ‌ప్రేమించే నాయకులు సీఎం కేసీఆర్ అని,  ఆయన స్పూర్తితో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ వారు 'తెలంగాణం' పేరుతో పద్య కవితా సంకలాన్ని రూపొందించారని కవిత తెలిపారు.


పద్య ప్రభంజనంలో ప్రతి పద్యంలో జాతీయత ఉట్టిపడుతోందన్న కవిత, ఇది ఒక జాతీయ  కావ్యంగా నిలిచిపోవాలన్నారు‌. నాటి పోతన నుండి ప్రతాపరెడ్డి వరకు ధిక్కారాన్ని చూపించిన నేల తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేసారు. ఆనాటి 'గోల్కొండ కవుల సంచిక'ను తెలంగాణ ఉద్యమ సమయంలో పునర్ముద్రించే అదృష్టం తెలంగాణ జాగృతి కే దక్కింద న్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ గ్రూప్ 1 ఆపీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి  డా. ఏనుగు నరసింహ రెడ్డి, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, మెతుకు సీమ అధ్యక్షులు పూసల లింగాగౌడ్, పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T00:21:01+05:30 IST