
హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి అవలంభిస్తోందన్నారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ప్రతి గింజా కొంటామంటేనే రైతులు వరి వేశారని చెప్పారు. కేసీఆర్ 24 గంటల గడువు తర్వాత తమ నిర్ణయం ఉంటుందని కవిత వ్యాఖ్యానించారు.