ఎమ్మెల్సీగా Kavitha ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-01-19T19:27:25+05:30 IST

టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు.

ఎమ్మెల్సీగా Kavitha ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ వీరిచే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి  మహమ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి,రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, బానుప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ, అసెంబ్లీ కార్యదర్శి డా.నర్సింహా చార్యులు, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T19:27:25+05:30 IST