భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ Kavitha

ABN , First Publish Date - 2022-07-11T17:15:00+05:30 IST

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ Kavitha

నిజామాబాద్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి(Narayana reddy), స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా(kristina)తో కవిత ఫోన్‌లో సమీక్షించారు.  స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు ఈ రోజు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఎమ్మెల్సీ కోరారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నందిపేట్, సిరికొండ, బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 

Updated Date - 2022-07-11T17:15:00+05:30 IST