ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-01-17T05:05:19+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్ని అబివృద్ధి చేయడమే విద్యారంగ సమస్యలకు పరిష్కారమని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

గుంటూరు (విద్య), జనవరి 16: ప్రభుత్వ పాఠశాలల్ని అబివృద్ధి చేయడమే విద్యారంగ సమస్యలకు పరిష్కారమని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు. శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో వాటిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారని తెలిపారు. ఇందుకు తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పి.బాబురెడ్డి మాట్లాడుతూ  విద్యాశాఖ కమిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అనేకసార్లు సమస్యలు విన్నవించినా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ, అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T05:05:19+05:30 IST