యాప్‌లతో బోదనకు ఆటంకం : ఎమ్మెల్సీ కేఎస్‌

ABN , First Publish Date - 2022-08-18T05:35:31+05:30 IST

ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెట్టిన యాప్‌లతో విద్యాబోదనకు ఆటంకం కలుగుతుందని, ప్రభుత్వం దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు.

యాప్‌లతో బోదనకు ఆటంకం : ఎమ్మెల్సీ కేఎస్‌
దాచేపల్లిలో గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్‌ నాయకులు

దాచేపల్లి, ఆగస్టు 17: ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెట్టిన యాప్‌లతో విద్యాబోదనకు ఆటంకం కలుగుతుందని, ప్రభుత్వం దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. బుధవారం దాచేపల్లిలో యూటీఎఫ్‌ నేతలతో ఆయన మాట్లాడుతూ తరగతుల విలీన ప్రక్రియకు విద్యార్థుల తల్లిందండ్రులు వ్యతిరేకంగా ఉన్నారని, దళితులు, పేదలకు ప్రాథమికను ప్రభుత్వం దూరం చేస్తుందనే వాదన వస్తుందన్నారు. 3,4,5 తరగతుల తరలింపును నిలిపివేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. టెట్‌ పరీక్షలు ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ వేసి ఉపాధ్యాయుల భర్తీని పూర్తిచేయాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌తో రూ.50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఇంత వరకు నెరవేర్చలేదన్నారు. పోలీసులు 15వేలు, గ్రూప్‌2 5వేలు, గ్రూప్‌1 1000 పోస్టులు అవసరంగా ఉన్నాయన్నారు. పల్నాడు యూటీఎఫ్‌ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఫేషియల్‌ అటెండెన్స్‌ను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి విజయసారధి మాట్లాడుతూ యాప్‌ల ద్వారా హాజరు ఆచరణసాధ్యం కాదన్నారు. సర్వర్లు పని చేయకపోవటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.  ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయులు భయపడుతున్నారన్నారు. కార్యక్ర మంలో పల్నాడు జిల్లా కార్యదర్శి వట్టెపు నాగేశ్వరరావు, వేల్పుల సత్యా నందం, యేసురత్నం, హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T05:35:31+05:30 IST