కవితకే పట్టం

ABN , First Publish Date - 2020-10-13T06:55:50+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎఎస్‌ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధిం చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార

కవితకే పట్టం

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కవిత ఘన విజయం

823లో 728 ఓట్లు సాధించిన కవిత 

బీజేపీ అభ్యర్థిపై 672 ఓట్ల మెజారిటీతో గెలుపు

డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు

రేపు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం


(నిజామాబాద్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నిజామాబాద్‌ అర్బన్‌ : 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎఎస్‌ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధిం చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆమె కు 672 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని కట్టబెట్టారు. కాం గ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్‌ దక్కకుండా చేశారు. స్థాని క సంస్థల ప్రతినిధులు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎ మ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతుతో గతంలో ఏ ఎమ్మెల్సీ ఎన్నికలో లేని విధంగా కవిత 823 ఓట్లకు గాను 728 ఓట్లు దక్కించుకొని 90 శాతానికిపైగా ఓట్లు సాధించా రు. ఈ ఫలితంతో తమ పార్టీకి ఉమ్మడి జిల్లా పరిధిలో తిరు గులేదని నిరూపించారు. ఎంపీగా పనిచేసిన సమయం లో భారీగా నిధులు తీసుకువచ్చిన కవితను మళ్లీ గెలిపిస్తే ఉ మ్మడి జిల్లాకు పెద్దత్తున నిధులు మంజూరు చేయిస్తారని భా వించిన ప్రజాప్రతినిధులు వార్‌ వన్‌ సైడే అన్నవిధంగా ఓట్లు వేశారు. ప్రతిపక్షాలు ఊహించని మెజారిటీని కట్టబెట్టారు. 


సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న కవిత

ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలుపొందిన  కవిత ధ్రువీకరణ పత్రం తీసుకోగానే ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం కేసీఆర్‌  ఆశీ ర్వాదం తీసుకున్నారు. ఆమె వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ బీబీ పాటిల్‌, రాజ్యసభ సభ్యుడు సురేష్‌ రెడ్డి ఎమ్మేల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీ ల్‌ అమీర్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, హన్మంత్‌ షిండే, జాజాల సురేందర్‌, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, బీజీగౌడ్‌, రాజేశ్వర్‌రావు, జడ్పీ చైర్మన్‌లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్‌ శోభ, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ఉన్నారు.


రేపు ప్రమాణ స్వీకారం 

బుధవారం శాసనమండలిలో కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మండలి సమావేశాలు ఉండడం వల్ల 11గంటల తర్వాత ప్రమాణ స్వీకా రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమె ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.


ఫలించిన మంత్రి, ఎమ్మెల్యేల సమష్టి కృషి

ఈ ఉప ఎన్నికలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌ అమీర్‌, జాజాల సురేందర్‌ల సమష్టి కృషి ఫలించింది. గత పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అప్రమత్తమ య్యారు. తమ నియోజకవర్గాలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిల ర్లు, కార్పొరేటర్లుతో మాట్లాడారు. ఓట్లు చీలకుండా చూశారు. ప్రతి పక్ష కాంగ్రెస్‌, బీజేపీ వారి మద్దతును కూడగట్టారు. తమ నియో జకవర్గాల పరిధిలో భారీగా ఓట్లు వచ్చే విధంగా చేశారు. వీరికి ఎంపీలు బీబీ పాటిల్‌, సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, వీజీ గౌడ్‌, జడ్పీ చైర్మన్లు, నగర మేయర్‌, ము న్సిపల్‌ చైర్మన్లు, సీనియర్‌ నేతలు సహకరించడంతో భారీ గా పార్టీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరు గులేని ఆధిక్యతను సాధించి పెట్టాయి.


నృత్యం చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

శాసనమండలి సభ్యురాలిగా కవిత ఎన్నిక కావ డం పట్ల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆమె నివాసం వద్ద బాణాసంచాకాల్చి సంబరాలు నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి మంత్రి ప్ర శాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎం పీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గు ప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీల్‌ అమీర్‌, ఆశ న్నగారి జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌ రావు, వీజీ గౌడ్‌, ఆకుల లలిత, జడ్పీ చైర్మన్‌లు దాదన్నగారి విఠల్‌ రావు, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర నాయకులు నృత్యా లు చేసి సందడి చేశారు.

Updated Date - 2020-10-13T06:55:50+05:30 IST