ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడి

ABN , First Publish Date - 2021-03-17T21:33:17+05:30 IST

ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో 1,537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు.

ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడి

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో 1,537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జి విజయం సాధించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పీఆర్టీయూ/ఎస్టీయూ బలపరిచిన అభ్యర్థి గంధం నారాయణరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షేక్‌ సాబ్జి, చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌ల మధ్య గట్టి పోటి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రదానంగా షేక్‌ సాబ్జి, గంధం నారాయణరావు నువ్వా నేనా.. అనే రీతిలో పోటీ పడ్డారు. అంతిమంగా సాబ్జినే విజయం సాధించారు. షేక్ సాబ్జికి 7,983 ఓట్లు పోలవగా.... నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే సాబ్జీ విజయం ఖారారైంది. ఈ ఎన్నికల్లో 17,467 ఓట్లకు గాను 16,054 పోలయ్యాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 


పశ్చిమగోదావరి జిల్లా నుంచి బరిలో ఉన్న షేక్‌ సాబ్జీకి యూటీఎఫ్‌, పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఆయన తరపున ప్రస్తుతం పదవుల్లో ఉన్న పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఇక జిల్లా నుంచి రేసులో ఉన్న గంధం నారాయణరావుకు వైసీపీ మద్దతు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరికి ఈయన స్వయాన మామయ్య కావడంతోపాటు పీఆర్‌టీయూ, ఎస్టీయూ తదితర కొన్ని ఉపాధ్యాయ సంఘాలూ మద్దతుగా నిలిచాయి. 

Updated Date - 2021-03-17T21:33:17+05:30 IST