ఉద్యోగుల భవిష్య నిధిపై సమగ్ర దర్యాప్తు జరపాలి

ABN , First Publish Date - 2022-07-01T06:36:32+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి రూ.800 కోట్ల సొమ్మును వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం విత్‌డ్రా చేయడం ఆందోళనకరమని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల భవిష్య నిధిపై సమగ్ర దర్యాప్తు జరపాలి

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌


 నల్లజర్ల జూన్‌ 30: ఉద్యోగుల భవిష్య నిధి రూ.800 కోట్ల సొమ్మును వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం విత్‌డ్రా చేయడం ఆందోళనకరమని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. నల్లజర్ల మండలం చోడవరం,తెలికిచర్ల హైస్కూళ్లను  గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ జారీ చేసిన జీవో 117 వెంటనే రద్దు చేయాలన్నారు.ప్రభుత్వం   ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాలను విడాలన్నారు.ఆయన వెంట యూటీఎఫ్‌ అధ్యక్షుడు సిహెచ్‌ మనోహర్‌ కుమార్‌,ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి మురళీధర్‌,కోఽశాధికారి కృష్ణబాలాజీ,గోపిచంద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-01T06:36:32+05:30 IST