‘ఎమ్మెల్సీని అరెస్టు చేయాలి’

ABN , First Publish Date - 2022-05-22T06:11:27+05:30 IST

కాకినాడలో దళిత సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, పార్టీ డోన్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

‘ఎమ్మెల్సీని అరెస్టు చేయాలి’
డోన్‌లో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

డోన్‌, మే 21: కాకినాడలో దళిత సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, పార్టీ డోన్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ కారు డిక్కీలో సుబ్రహ్మణ్యం అనే యువకుడి మృతదేహం దొరికినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన తాడికొండ నియోజకవర్గానికి చెందిన వెంకాయమ్మపై వైసీపీ నాయకులు దాడి చేయడం సిగ్గు చేటన్నారు. డా.సుధాకర్‌ను వేధించి అక్రమ కేసులు పెట్టడంతో ఆయన గుండెపోటుతో మరణించారన్నారు. ఆదోని నియోజకవర్గంలోని గోనేహాల్‌లో దళితులపై వైసీపీ పెద్దల సహకారంతో దాడులు చేయడం చాలా అన్యాయమన్నారు. దళితులపై దాడులను ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. సమావేశంలో డోన్‌ మండల టీడీపీ ఉపాధ్యక్షుడు రాముడు, పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు బాలు, పట్టణ ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, మిట్ట మద్దయ్య, బండి పుల్లన్న, రామాంజనేయులు, రంగన్న పాల్గొన్నారు.


గడివేముల: వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైందని టీడీపీ  ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామోదరం నాగశేషులు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ కారులో సుబ్రహ్మణ్యం మృతి ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కాకినాడలోని జీజీహెచ్‌కు వెళ్లగా అక్కడ టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. వైసీపీకి దళితులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 


పాములపాడు: వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై ఎస్సీ, ఎస్టీ, ఆట్రాసిటీ, హత్యయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి స్వాములు డిమాండ్‌ చేఽశారు. శనివారం పాములపాడులోని ఎస్సీ కాలనీలో నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ పాత పగలు మనసులో ఉంచుకొని సుబ్రహ్మణ్యంను హత్య చేశారని ఆరోపించారు. మారెన్న, వెంకటేశ్వర్లు, రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-22T06:11:27+05:30 IST