దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-02-25T05:30:00+05:30 IST

టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించనుంది. ఈ మేరకు గురువారం అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా కింద ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ

దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ

టెక్కలి, ఫిబ్రవరి 25: టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించనుంది. ఈ మేరకు గురువారం అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా కింద ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. 1994లో యువజన కాంగ్రెస్‌ నాయకునిగా దువ్వాడ శ్రీనివాస్‌ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో ఆటు, పోటుల మధ్య అంచెలంచెలుగా ఎదుగుతూనే.. చివరికి శాసనమండలి స్థానానికి చేరుకున్నారు. 2006లో టెక్కలి మండల జడ్పీటీసీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. జిల్లాపరిషత్‌ ఉపా ధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి.. టెక్కలి నియో జకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత అక్కడి ఉప ఎన్నిక లోనూ ఓటమి చెందారు. 2014లో వైసీపీలో చేరారు. అదే ఏడాది టెక్కలి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి మళ్లీ ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి మరోసారి ఓటమి చెందారు. అయినా తనదైన శైలిలో దువ్వాడ రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు. దీంతో సీఎం జగన్‌.. టెక్కలి నియో జకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ క్రమంలో దువ్వాడ దూకుడు పెంచి.. కింజరాపు రాజకీయ కోటను బద్దలుకొట్టే ప్రయత్నం చేశారు. ‘స్థానిక’ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని 112 సర్పంచ్‌ స్థానాలు వైసీపీ మద్దతుదారులను గెలిపిం చుకోవడంలో సఫలీకృతమయ్యారు. దీంతో దువ్వాడకు  అధిష్ఠానం వద్ద మరింత గౌరవం లభించింది. శాసన సభ్యుల కోటాలో శాసనమండలికి ఆయనను ఎంపిక చేసింది. దీంతో దువ్వాడ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, కుటుంబసభ్యులు  హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లా డుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.  

Updated Date - 2021-02-25T05:30:00+05:30 IST