మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలు

ABN , First Publish Date - 2021-02-25T04:50:44+05:30 IST

ప్రధాని మోదీ, సీ ఎం కేసీఆర్‌ తోడుదొంగలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరో పించారు.

మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలు
వనపర్తిలో మాట్లాడుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డి, చిత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి

- ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు 

- ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో సీఎం చెప్పాలి

- ఆ తర్వాతే పట్టభద్రులను ఓట్లు అడగాలి 

- రామచందర్‌రావు ఆరేళ్లల్లో ఒక్కసారైనా మాట్లాడారా?

- వాణీదేవికి పీవీపై ప్రేమ, గౌరవం ఉంటే పోటీ నుంచి తప్పుకోవాలి 

- 24 క్యారెట్ల బంగారం కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి

- మోదీకి, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేలా ఆయన్ను గెలిపించాలి 

- పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి

- నిరుద్యోగ భ ృతి, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే నిరాహార దీక్ష 

- పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/వనపర్తి టౌన్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని మోదీ, సీ ఎం కేసీఆర్‌ తోడుదొంగలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరో పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బు ధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్ష న్‌ హాల్‌తో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మా ట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని ప్ర ధాని, ఇంటికో ఉద్యోగమిస్తానని కేసీఆర్‌ ఏడేళ్ల కిందట హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఇద్దరూ ఇచ్చిన హామీలు విస్మరించి నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు.


తెలంగాణలో 1.97 లక్షల ఉద్యోగాల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో సమాధానం చె ప్పాకే కేసీఆర్‌ పట్టభద్రులను ఓట్లు అడగాలని అన్నా రు. బండి సంజయ్‌ తొండి సంజయ్‌ అని పేర్కొన్న రే వంత్‌రెడ్డి రామచందర్‌రావు ఆరేళ్లలో ఒక్కరోజైనా నిరు ద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసమస్యలపై ఎందు కు మాట్లాడలేదని నిలదీశారు. పక్కాగా ఓడిపోయే సీ టు కాబట్టే వాణీదేవిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబె ట్టారని, పీవీపై ఆమెకు ఏమాత్రం గౌరవం, ప్రేమ ఉన్నా పోటీ నుంచి విరమించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా స మస్యలపై చర్చకు తాము మహబూబ్‌నగర్‌, హైదరా బాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడైనా సిద్ధమని, అందు కు సీఎం, మంత్రి కేటీఆర్‌ సిద్ధమా అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.


చిన్నారెడ్డి 40 సంవత్సరాలుగా రా జకీయం చేస్తూ కూడా ఏ రోజూ స్వార్జితం కోసం ప ని చేయలేదన్నారు. 1985లో చిన్నారెడ్డి గెలుపు కోసం వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా గోడలపై పేర్లు రా శానని, ఇప్పుడు ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే గెలుపు బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. 24 క్యారెట్ల బం గారం లాంటి చిన్నారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి అని, పట్టభ ద్రులు ఆయనను గెలిపించి మోదీకి, కేసీఆర్‌కి గుణ పాఠం చెప్పాలని అన్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవ ర్గంలో 616 బూతులు ఉన్నాయని, ప్రతి బూత్‌లో చి న్నారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడే విధంగా కా ర్యకర్తలు, నిరుద్యోగులు, ఉద్యోగులు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే తాను ఎ మ్మెల్సీగా గెలిచాక సీఎం కేసీఆర్‌కు విన్నవించి మూ డు నెలల గడువిస్తానని, అప్పట్లోగా ఈ పనుల చేయ కపోతే ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష అన్నా రు.


సతీష్‌ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓ వైపు ఉద్యోగాల ప్రకటన చేసి, మరో వైపు జోనల్‌ వ్యవస్థ అడ్డంకిగా సీఎం నాటుకాలు ఆడుతున్నారన్నారు. ఏఐ సీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఏడే ళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరక పోవడం బాధాకరమన్నారు.


టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ గె లిస్తే నాగార్జునసాగర్‌, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలు పునకు బాటలు పడతాయని అన్నారు. 

కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌క ర్నూల్‌ డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్‌, శంకర్‌ప్ర సాద్‌, వంశీకృష్ణ, పీసీసీ కార్యదర్శులు జి.మఽధుసూదన్‌ రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్‌, తిరుపతిరెడ్డి, బాలమణెమ్మ, అ నితారెడ్డి, శ్రీహ రి, శంకర్‌, సం జీవ్‌, లక్ష్మణ్‌, ప్రియాంకా రె డ్డి, జహీర్‌ అ క్తర్‌, సీజె బెన హర్‌, పీసీసీ స భ్యుడు శ్రీనివా స్‌గౌడ్‌, వనపర్తి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్య క్షురాలు ధనల క్ష్మి పాల్గొన్నారు.



Updated Date - 2021-02-25T04:50:44+05:30 IST