హైదరాబాద్‌లో MMTS రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2022-07-11T16:11:48+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిటీలో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లో MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిటీలో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నేటి నుంచి నుంచి మూడు రోజుల పాటు 34 ఎంఎంటీఎస్ రైళ్ళ సర్వీసులను నిలిపివేస్తన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 


మరోవైపు... భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ (RED Alert) కొనసాగుతోంది. ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ అర్బన్, రూరర్, జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పై జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.


Updated Date - 2022-07-11T16:11:48+05:30 IST