Patialaలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత...ముగ్గురు పోలీసు అధికారులపై సీఎం బదిలీవేటు

ABN , First Publish Date - 2022-04-30T17:41:04+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా నగరంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు...

Patialaలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత...ముగ్గురు పోలీసు అధికారులపై సీఎం బదిలీవేటు

పాటియాలా: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా నగరంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.శనివారం ఉదయం 9:30 నుండి రాత్రి 9 గంటల వరకు పాటియాలాలో ఇంటర్నెట్ సేవలను పంజాబ్ హోం శాఖ నిలిపివేసింది.సీఎం భగవంత్ మాన్ ఆదేశంతో ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.పాటియాలా నగరంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ముగ్గురు ప్రభుత్వ పోలీసు అధికారులపై పంజాబ్ సర్కారు బదిలీ వేటు వేసింది.పాటియాలా ఐజీపీ రాకేష్ అగర్వాల్,సీనియర్ ఎస్పీ నానక్ సింగ్, నగర ఎస్పీ హర్పాల్ సింగ్ లపై సీఎం భగవంత్ మాన్ బదిలీ వేటు వేశారు.


Updated Date - 2022-04-30T17:41:04+05:30 IST