వాట్సాప్ మరో కలకలం.. వెబ్ యూజర్ల నంబర్లు గూగుల్ సెర్చ్‌లో!

ABN , First Publish Date - 2021-01-16T02:43:08+05:30 IST

వాట్సాప్ ప్రైవసీ పాలసీ దుమారం ఇంకా సద్దుమణగకముందే మరో కలకలం రేగింది. వాట్సాప్ మరో ఉల్లంఘన

వాట్సాప్ మరో కలకలం.. వెబ్ యూజర్ల నంబర్లు గూగుల్ సెర్చ్‌లో!

న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రైవసీ పాలసీ దుమారం ఇంకా సద్దుమణగకముందే మరో కలకలం రేగింది. వాట్సాప్ మరో ఉల్లంఘన బయటపడింది. గూగుల్ సెర్చ్‌లో ఇండెక్సింగ్ ద్వారా  వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు దర్శనమిచ్చాయి. దేశంలో 400 మిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఇన్‌స్టాంట్ చాట్‌ కోసం డెస్క్‌టాప్, పీసీలను ఉపయోగిస్తుంటారు. ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా శుక్రవారం.. గూగుల్ సెర్చ్‌లో కనిపించిన వాట్సాప్ వెబ్ యూజర్ల వ్యక్తిగత ఇండెక్సింగ్ నంబర్లను షేర్ చేశారు. 


ఎవరైనా వెబ్ వెర్షన్ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గూగుల్ సెర్చ్‌లో మొబైల్ నంబర్లు ఇండెక్స్ అవుతాయి. లీకైన ఇండెక్సింగ్ నంబర్లు బిజినెస్ నంబర్లు కావని, వ్యక్తిగతమైనవని రాజహరియా తెలిపారు. గతవారం ప్రైవేటు గ్రూప్ చాట్ లింక్స్ గూగుల్ సెర్చ్‌లో కనిపించి కలకలం రేపాయి. దీంతో స్పందించిన వాట్సాప్.. ఇలాంటి చాట్‌లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‌ను కోరినట్టు తెలిపింది. అంతేకాదు, గ్రూప్ చాట్ లింకులను బహిరంగ యాక్సెస్ కలిగే వెబ్‌సైట్లలో షేర్ చేయవద్దని సూచించింది. 


ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ ఆహ్వాన లింకులను గూగుల్ ఇండెక్స్ చేసింది. అంటే దీనర్థం.. ఎవరైనా సింపుల్ సెర్చ్‌తో ప్రైవేట్ గ్రూప్ చాల్స్‌లో చేరొచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ఇండెక్స్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ లింకులను గూగుల్ తొలగించింది. అయితే, వాట్సాప్ చెప్పినప్పటికీ గూగుల్ ఇంకా ఇండెక్స్ చేస్తూనే ఉందని రాజహరియా తెలిపారు. 

Updated Date - 2021-01-16T02:43:08+05:30 IST