మొబైల్ షాపులో దొంగనోట్ల ముద్రణ.. వాటిని ఎక్కడ మార్చే వాడంటే?

ABN , First Publish Date - 2022-05-13T06:10:24+05:30 IST

మొబైల్, జిరాక్స్ షాపు నడిపే ఒక వ్యక్తి.. దొంగనోట్లు ముద్రిస్తున్నాడని తెలిసి అక్కడి ప్రజలు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో వెలుగు చూసింది...

మొబైల్ షాపులో దొంగనోట్ల ముద్రణ.. వాటిని ఎక్కడ మార్చే వాడంటే?

మొబైల్, జిరాక్స్ షాపు నడిపే ఒక వ్యక్తి.. దొంగనోట్లు ముద్రిస్తున్నాడని తెలిసి అక్కడి ప్రజలు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో వెలుగు చూసింది. 


మొబైల్, జిరాక్స్ షాపు నడిపే రవి కుమార్ అనే వ్యక్తి.. దొంగ నోట్లు వాడుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో తను చేసిన తప్పును రవి కుమార్ అంగీకరించాడు. 


తన జిరాక్స్ షాపులోనే కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీస్తానని చెప్పాడు. అలాగే బిజీగా ఉండే మార్కెట్లు, మద్యం దుకాణాల్లో ఆ డబ్బును మార్చేస్తానని వెల్లడించాడు. అతనిపై 489 ఏ, 489 బీ, 489 సీ, 489 డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు.. రవి నడిపే షాపుపై రెయిడ్ చేశారు. అక్కడ వాళ్లకు మొత్తం 23 కరెన్సీ నోట్లు దొరికాయి. ఇప్పటి వరకు రవి మొత్తం 40 దొంగనోట్లు మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more